కోలుకోలేని దెబ్బ కొట్టారు.. ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్?
ఇలాంటి సమయంలోనే ప్రేక్షకుల అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఎవరు ఊహించిన విధంగా అద్భుతమైన ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ జట్టు అటు సొంత గడ్డిపైన ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. దీంతో అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. ఏకంగా 89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోవడం గమనార్హం. ఇక ఈ ఓటమితో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇక ఈ ఘోర ఓటమి తర్వాత మొదటి మ్యాచ్ లోనే పరాజయం పాలు కావడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ పించ్ స్పందించాడు.
మొదటి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ ఓపెనర్లు ఎంతో అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలోనే మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు అంటూ ఫించ్ వ్యాఖ్యానించాడు. మేము శుభారంభం చేయాలని భావించినప్పటికీ అది కుదరలేదు అంటూ తెలిపాడు. ఇక మొదటి మ్యాచ్ లో ఓటమి కారణంగా టోర్నీలో మిగిలి ఉన్న మిగతా మ్యాచ్లో మాత్రం జాగ్రత్తగా ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. ఇక ఇలా మొదటి పరాజయానికి సమిష్టి వైఫల్యం కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థులను కట్టడి చేయలేక.. ఇక లక్ష్య చేదనలో తడబడి చివరికి ఓడిపోయాం. రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. ఇక అటు ఒకవైపు హార్డ్ వర్క్ మాత్రమే కాదు అదృష్టం కూడా కలిసి రావాలి అంటూ ఆరోన్ పించ్ చెప్పుకొచ్చాడు.