పాక్ పర్యటనపై.. కొత్త బిసిసిఐ అధ్యక్షుడు ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లు కూడా ఒక దేశ పర్యటనకు మరొక జట్టు వెళ్లడం అస్సలు జరగదు. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగగా అటు దశాబ్దాలు గడిచిపోతుంది. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలబడుతున్నాయి.  ఇలాంటి సమయంలో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. వచ్చే ఏడాది ఆసియా కప్ కూ అటు పాకిస్తాన్ జట్టు ఆతిథ్యం ఇస్తుంది అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో ఆడే టీమ్ ఇండియా అటు పాకిస్తాన్లో పర్యటిస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.


 వచ్చే ఏడాది ఆసియాక పాకిస్తాన్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక తాము ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నాము అంటూ ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం  చేశారు. ఇదే జరిగితే తాము ఇండియాలో జరిగే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటాము అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సభ్యులు కూడా చెబుతూ ఉండడం గమనార్హం. కాగా దీనికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ స్పందించాడు.  ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు


 ఆసియా కప్ పాకిస్తాన్లో జరుగుతున్న నేపథంలో భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాల వద్ద అనే విషయంపై నిర్ణయం బీసీసీఐ మాత్రమే తీసుకోలేదని... భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే తాము కూడా ముందుకు వెళ్తాం అంటూ రోజర్ బిన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పాకిస్తాన్ పర్యటనకు అనుమతిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఒకవేళ భారత ప్రభుత్వం టీమిండియాను పాకిస్తాన్ పర్యటనకు అనుమతించినట్లయితే అది మలో సరికొత్త చరిత్రకు నాంది పలికినట్లు అవుతుంది అని చెప్పాలి. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇరుదేశాల మధ్య మళ్ళి క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించేందుకు ఒక బీజం పడినట్లు అవుతుంది అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: