పొట్టలేసుకొని వరల్డ్ కప్ గెలుస్తారా.. పాక్ పరువు తీసిన మాజీ ప్లేయర్?
ఇలాంటి సమయంలోనే కొంతమంది క్రికెటర్లు మాత్రం ఇంకా ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ కెరియర్ను ప్రమాదంలో పడేసుకుంటున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్ల ఫిట్నెస్ పై ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి అని చెప్పాలి. గతంలో ఇక వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన ప్రతిసారి కూడా ఇక పాక్ జట్టు ఆటగాళ్ల ఫిట్నెస్ పై ఆ దేశ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
ఇక ఇప్పుడు ఇలాంటిదే మరోసారి చర్చకు వచ్చింది. ఏకంగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఆ దేశ జట్టులో కొనసాగుతున్న ప్లేయర్ల ఫిట్నెస్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఏకంగా పాకిస్తాన్ జట్టు పరువు తీసేసాడు ఆ జట్టు మాజీ ఆటగాడు మిస్బా ఉల్ హక్. పొట్టలేసుకొని వరల్డ్ కప్ ఏం గెలుస్తారంటూ ఎద్దేవా చేశాడు. వార్మప్ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం పై స్పందించిన మిస్బా ఉల్ హక్ ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్లు ఫిట్ గా లేరని మైదానంలో చురుకుగా కదల లేకపోతున్నారు అంటూ ఎద్దేవా చేశాడు. ఇలాంటి ఫిట్నెస్ తో వరల్డ్ కప్ ఎలా గెలుస్తారు అంటూ ప్రశ్నించాడు.