టి20 వరల్డ్ కప్.. రోహిత్ కు సచిన్ సలహా?
ఇది టీమిండియా కు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఇకపోతే మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ప్రారంభం కాబోతుండగా.. భారత జట్టు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తే బాగుంటుంది అనే విషయంపై పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఇటీవల ఇదే విషయంపై భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు. అటు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ వ్యూహాలపై కీలక సూచన చేశాడు అని చెప్పాలి.
టీమిండియా తుదిజట్టులో తప్పకుండా ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉండాలి అంటూ సూచించాడు సచిన్ టెండూల్కర్. ఇలా లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ప్రత్యర్థి బౌలర్లను ఇరకాటంలో పెట్టేందుకు అవకాశం ఉంటుంది అంటూ వివరించాడు. జట్టులో కేవలం ముగ్గురిపైనే ఆధారపడి ముందుకు వెళ్లకూడదు అంటూ సూచించాడు. ఎవరు ఏ స్థానంలో బాగా రాణిస్తారు అనే విషయంలో ఒక అవగాహనకు వచ్చి ఇక వారిని ఆ స్థానంలోనే పంపడం ఎంతో ఉత్తమం అంటూ సూచించాడు. అంతేకాకుండా ప్రత్యర్థి బలాబలాలపై కూడా అవగాహన పెంచుకోవాలని తెలిపాడు సచిన్ టెండూల్కర్.