ఆఫ్ స్టంప్ బంతులపై ప్రశ్న.. కోహ్లీ సమాధానం అదుర్స్?
ఎప్పుడూ తనదైన ప్రశ్నలతో ఇక ప్రేక్షకులను ఆకట్టుకునే కమెడియన్ డానిష్ ఇక ఇప్పుడు మరోసారి ఆసక్తికర ప్రశ్నలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని ఒక ఆసక్తికర ప్రశ్న అడగగా.. కోహ్లీ సీరియస్ అయ్యాడు అని చెప్పాలి. నడుచుకుంటూ వెళుతున్న కోహ్లీ దగ్గరికి వెళ్లి కోహ్లీ నువ్వు ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళుతున్న బంతులను ఆడతావా.. లేకపోతే వదిలేస్తావా అంటూ ప్రశ్నించాడు కమెడియన్ డానిష్. ఇక ఈ ప్రశ్న కోహ్లీకి చిరాకు తెప్పించింది.. దీంతో సీరియస్ గా లుక్ ఇచ్చి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అయితే గత కొంతకాలం నుంచి ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళుతున్న బంతులను వేటాడబోయి విరాట్ కోహ్లీ వికెట్ చేజార్చుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆఫ్ స్టంప్స్ కి దూరంగా వెళుతున్న బంతులు విరాట్ కోహ్లీకి బలహీనతగా మారిపోయాయి అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇటీవలే కమెడియన్ డానిష్ కూడా ఇదే విషయంపై ప్రశ్నించాడు . కోహ్లీ మాత్రం సీరియస్గా చూస్తూ ఇక సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. దీనిపై కమెడియన్ స్పందిస్తూ బాగా వదిలేశారు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి ఎంతో మంది ననెటిజన్లు నవ్వుకుంటున్నారు..