చాహల్ దెబ్బకు.. హెల్మెట్ పెట్టుకున్న మాక్స్ వెల్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో 360 డిగ్రీస్ లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలిగిన బ్యాట్స్మెన్లు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు కొడుతూ ఉంటారు కొంతమంది క్రికెటర్లు. చిత్ర విచిత్రమైన షాట్లతో అటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్లో 360 డిగ్రీస్ ప్లేయర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు మ్యాక్స్వెల్. మైదానానికి నలువైపులా  బ్యాటింగ్ చేయగల సామర్థ్యం మ్యాక్స్వెల్ సొంతం అని చెప్పాలి. ముఖ్యంగా స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ లను ఆడుతూ ఎప్పుడు ప్రత్యర్థి ఫీల్డింగ్  తో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు.


 ఇలా ఎప్పుడూ సర్ ప్రైసింగ్ షాట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు మాక్స్వెల్ అని చెప్పాలి. అయితే ఇలా కొత్త షాట్లు కనెక్ట్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఏదైనా తేడా కొడితే మాత్రం చివరికి గాయం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇటీవలే మాక్స్వెల్ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇటీవల  భారత్ ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా రివర్స్ స్వీప్ షాట్ ఆడెందుకు ప్రయత్నించాడు మ్యాక్స్వెల్. కానీ అతని లెక్క తప్పింది. చివరికి వేగంగా దూసుకొచ్చిన బంతి ముఖానికి తగిలింది.


 సాధారణంగా బ్యాట్స్మెన్లు స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎలాంటి హెల్మెట్ లేకుండానే బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. కానీ చాహల్ బౌలింగ్ లో మాత్రం అటు మాక్స్వెల్ హెల్మెట్ పెట్టుకొని బ్యాటింగ్ చేయడం గమనార్హం. చాహల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా బ్యాట్ ఎడ్జ్ కి తాకిన బంతి నేరుగా మ్యాక్స్ వెల్ తలకి వచ్చి తగిలింది. దీంతో అతని తల గిర్రున తిరిగినంత పని అయింది. ఇక తర్వాత మైదానంలోకి పరిగెత్తుకొచ్చిన ఫిజియో అతని టెస్ట్ చేసి ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలని ఆడాలని సూచించడంతో అతను హెల్మెట్ తోనే ఆడాడు. ఈ వీడియో ట్విట్టర్ లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: