అందుకే షమీకి ఆఖరి ఓవర్ ఇచ్చాను : రోహిత్

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో జట్టు కెప్టెన్ గా ఉన్న ఆటగాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్న విషయంపై ప్రేక్షకుల అందరిలో కూడా ఒక అవగాహన ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కెప్టెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న విషయాన్ని ముందుగానే పసిగడుతూ ఉంటారు ప్రేక్షకులు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి. ఎందుకంటే  ప్రేక్షకులు అంచనా వేసుకున్నది ఒకరి గురించి అయితే అక్కడ కెప్టెన్ పంపించేది మాత్రం మరొకరిని అని చెప్పాలి.


 ఇక ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలాంటిదే చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మరికొన్ని రోజుల్లో టీమిండియా టి20 వరల్డ్ కప్ ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతుంది. ఇక అంతకు ముందుగానే ఇక ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లలో టీమిండియా మునిగి  తేలుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అటు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా గెలవాలంటే ఆఖరి ఓవర్లో 11 పరుగులు కావాలి.



 ఇలాంటి సమయంలో ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతుండగా రోహిత్ శర్మ మాత్రం ఎవరూ ఊహించని విధంగా అనూహ్యమైన  నిర్ణయం తీసుకున్నాడు.  ఏడాది కాలం తర్వాత టి20 జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీతో అప్పటివరకు ఒక్క ఓవర్ కూడా వేయించని రోహిత్ ఇక చివరి ఓవర్ అతనికి ఇచ్చాడు. ఈ క్రమంలోనే షమీ సక్సెస్ అయ్యాడు  అయితే చివరి ఓవర్ అతనికి ఇవ్వడం పై స్పందించాడు రోహిత్ శర్మ. అయితే ముందుగానే అతనికి ఒక ఓవర్ వేసే అవకాశం ఇవ్వాలి అనుకున్నాము. అది కూడా సవాలుతో కూడుకున్నదైతే బాగుంటుంది అని భావించాం. అందుకే అతనితో ఆఖరి ఓవర్ వేయించాం. ఇక అతను ఏం చేశాడో అందరూ చూశారు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: