రోహిత్ ను ఎలా ఔట్ చేయాలో.. బాబర్ కు నేనే చెప్పాను?

praveen
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్న రమిజ్ రజా గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఎప్పుడు సంచలనంగానే మారిపోతున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈనెల 23వ తేదీన జరగబోయే మ్యాచ్ గురించి తనదైన శైలిలో ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు రమిజ్ రజా. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు భారత అభిమానుల ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది టి20 ప్రపంచకప్ లో భాగంగా రోహిత్ శర్మ షాహిన్ ఆఫ్రిది  బౌలింగ్లో గోల్డెన్ డకౌట్  గా వెను తిరగడం గురించి ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశాడు రమిజ్ రజా.


 గత  టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బాటింగ్ దిగిన రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు. షాహిద్ ఆఫ్రిది వేసిన తొలి ఓవర్లో వేసిన నాలుగో బంతికి రోహిత్ వికెట్ కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఇక ఆ తర్వాత మిగతా బ్యాట్స్మెన్లు కూడా విఫలం కావడంతో తక్కువ పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు మొదటిసారి టీమిండియా పై 10 వికెట్ల  తేడాతో విజయం సాధించింది. ఇకపోతే ఇప్పుడు అక్టోబర్ 23వ పాకిస్తాన్ భారత్ మధ్య తొలి మ్యాచ్ మెల్ బోర్న్  మైదానంలో జరగబోతుంది.


 ఈ మ్యాచ్ కోసం అందరూ వెయ్యికాళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే గత ఏడాది ప్రపంచ కప్ లో రోహిత్ అవుట్ పై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమిజ్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ను  ఎలా అవుట్ చేయాలి అనే విషయంపై తానే ప్లాన్ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ కి ముందు చీఫ్ సెలెక్టర్ తో పాటు బాబర్ నన్ను కలిశాడు. భారత్ తో ఆటపై అతని వ్యూహం గురించి అడిగాను. రోహిత్ ను ఎలా అవుట్ చేయాలో చెప్పాను. తక్కువ ఎత్తు ఉన్న ఆటగాడిని ఎంపిక చేసుకోవాలి. ఇన్ స్వింగర్ యార్కర్ నిర్దిష్ట వేగంతో వేయాలి. సింగిల్ తీసే అవకాశం సైతం ఇవ్వకుండా స్ట్రైక్ లో మాత్రమే ఉంచాలి. ఇలా చేస్తే ఇక అతన్ని అవుట్ చేసినట్టే అంటూ బాబర్ కూ వివరించానంటూ రమిజ్ రజా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: