పాకిస్తాన్ తో మ్యాచ్.. ఆ ఇద్దరిలో ఒక్కరికే చోటు : రాబిన్ ఉత్తప్ప

praveen
ప్రపంచక ప్రారంభమైంది. అయితే భారత్ జట్టు ప్రస్థానం ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో హోరా హోరీగా తలబడేందుకు  సిద్ధమవుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం కేవలం ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియా కీలక బౌలర్ బుమ్రా గాయంకారణంగా జట్టుకు దూరం అవడం టీమిండియాకు ఎదురు దెబ్బ అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే  వరల్డ్ కప్ స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేసిన మహమ్మద్ షమిని బూమ్రా స్థానంలో ఇక వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్న షమి ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో ఎలా రాణించబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక టి20 వరల్డ్ కప్ లో టీమిండియా బౌలింగ్ కూర్పు ఎలా ఉండబోతుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.


 మహ్మద్ షమీ జట్టులోకి రావడంతో టీమ్ ఇండియాలో ఫాస్ట్ బౌలర్ల  సంఖ్య నలుగురికి చేరింది. దీంతో తుది జట్టులో మరొక ఆటగాడి స్థానపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప సందేహం వ్యక్తం చేశాడు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లో ఎవరో ఒక్కరే తుదిచెట్టులో ఉండే అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అర్షదీప్ సింగ్, షమీలు రాణిస్తారు. కానీ భువనేశ్వర్, హర్షల్ పటేల్ మధ్య పోటీ ఉంటుంది. ఇక రానున్న ప్రాక్టీస్ మ్యాచ్లలో వీరిద్దరూ ఎలా ఆడుతారో అనేది ఎంతో కీలకం. బాగా ఆడిన వారే తుది జట్టులో ఉంటారు అంటూ రాబిన్ ఉత్తప్ప  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: