హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డ్.. తొలి మహిళా క్రికెటర్?

praveen
ఒకప్పుడు భారత క్రికెట్లో కేవలం పురుషుల క్రికెట్ కి మాత్రమే ఎక్కువగా క్రేజ్ ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం మహిళా క్రికెటర్లు కూడా తామ పురుష క్రికెటర్లకు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. తమ ఆట తీరుతో అద్భుతమే చేసి చూపిస్తున్నారు అని చెప్పాలి. ఇక విదేశీ పర్యటనకు వెళ్లిన లేకపోతే సొంత గడ్డపై మ్యాచ్ లు ఆడిన కూడా ప్రత్యర్థులపై  పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. టోర్నీ ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా విజయం సాధించడమే లక్ష్యంగా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది భారత మహిళల జట్టు.

 ఒకవైపు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తూ ప్రత్యర్థిని దెబ్బకొడుతూ ఉంటే.. మరోవైపు జట్టులోని ప్లేయర్లు అందరూ కూడా సమిష్టిగా రానించి జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నారు అని చెప్పాలి. ఇక భారత మహిళా క్రికెట్లో ఉన్న ఎంతో మంది ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇకపోతే టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కవర్ ఒక అరుదైన రికార్డు సృష్టించింది.

 ఇటీవలే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఇక ఆమె ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించింది హర్మన్ ప్రీత్ కౌర్. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్ గా మాత్రమే కాకుండా బ్యాట్స్మెన్ గా కూడా అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ గెలవడంలో కీలక పాత్ర వహించింది. 1999 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టును  ఓడించడం మొదటిసారి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: