ధావన్ టీమ్ ను.. బీ టీమ్ అంటే అస్సలు ఒప్పుకోను?

praveen
ప్రస్తుతం ప్రస్తుతం టీమిండియా పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఈ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ఆడింది టీమ్ ఇండియా జట్టు. అయితే టి20 సిరీస్ లో భాగంగా అటు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి కీలక ఆటగాళ్లు కూడా జట్టులో ఉండేవారు.


 కానీ సౌత్ సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ నేపథ్యంలో ఆ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది జట్టు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇక ప్రపంచ కప్ కోసం జట్టు సభ్యులందరూ ఆస్ట్రేలియా పయనం అయ్యారు. ఈ క్రమంలోనూ మిగిలిన ఆటగాళ్లు ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అటు సౌత్ ఆఫ్రికా తో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు మ్యాచ్లు ఆడుతుంది అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ లో తలబడుతున్న టీమ్ ఇండియా జట్టు ద్వితీయ శ్రేణి జట్టు అంటూ ఎంతోమంది విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉండడంపై ఇటీవల దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, విరాట్ కోహ్లీ లేనంత మాత్రాన టీమిండియా కు తక్కువ అంచనా వేయడానికి లేదని పేర్కొన్నాడు. శిఖర్ ధావన్ సేనను భారత్ బీ టీం అంటే ఒప్పుకోను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ జట్టులోను ఎంతో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ వ్యాఖ్యానించాడు. ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ స్థాయి జట్లను బరిలోకి దించే సత్తా టీమిండియాకు ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: