బాబర్ పై ట్రోలింగ్.. మధ్యలోకి కోహ్లీని లాగిన రమిజ్ రాజా?
అయితే బాబర్ అజం సెంచరీ చేశాడు అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోష పడుతూ ఉన్న సమయంలో.. అతను చేసిన సెంచరీపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఎంతోమంది నెటిజెన్లు. ఒకప్పటిలా బాబర్ దూకుడుగా ఆడటం లేదని భారీగా పరుగులు చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ బంతులు అతడు సమయం తీసుకుంటున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. అందుకే అతని స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా పడిపోతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇలా బాబర్ అజం స్ట్రైక్ రేట్ పై విమర్శలు చేస్తున్న వారిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రాజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సరైన స్ట్రైక్ రేట్ కొనసాగించడం లేదు అంటూ బాబర్ వస్తున్న విమర్శలను ఖండించాడు రమిజ్ రాజా. మూడేళ్ల నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో ఉన్న సమయంలో ఆఫ్గనిస్తాన్ పై ఒక్క సెంచరీ చేస్తే చాలు అంతకు ముందు జరిగిన అన్ని విషయాలను కూడా అందరూ మరిచిపోయారు. కానీ ఆసియా కప్ లో రన్నరపుగా నిలిచిన బాబర్ అజాం స్ట్రైక్ రేట్ పై ట్రోలింగ్ చేయడం మాత్రం పనికిమాలిన చర్య అంటూ రమిజ్ రాజా వ్యాఖ్యానించాడు.