శుబ్ మాన్ గిల్ వికెట్ కోల్పోయిన ఇండియా... కెప్టెన్ పై భారం !

VAMSI
ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్యన మొదటి వన్ డే లక్నో వేదికగా జరుగుతోంది. ఈ సిరీస్ కు మాత్రమే జూనియర్ లతో కూడిన జట్టు మరియు ఆ జట్టుకు కెప్టెన్ గా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఎన్నికయ్యాడు. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. అప్పటికే వర్షం కారణంగా ఆలస్యం కావడంతో అంపైర్లు మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. సౌత్ ఆఫ్రికా మొదట నెమ్మదిగా ఆడుతూ వికెట్లను కాపాడుకుంది.. కానీ శార్దూల్ ఠాకూర్ వరుసగా వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా తక్కువ స్కోర్ కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అప్పటికే క్రీజులో ఉన్న క్లాషెన్ తో జత కలిసిన మిల్లర్ జట్టును ఆదుకున్నాడు.
వీరిద్దరూ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. అలా సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ స్కోర్ లో క్లాషెన్ 74 పరుగులు మరియు మిల్లర్ 75 పరుగులు చేశారు. అంతే కాకుండా అయిదవ వికెట్ కు 139 పరుగులు జోడించారు. ఇక ఇండియా బౌలర్లలో శార్దూల్ 2, కుల్దీప్ 1 మరియు బిష్ణోయ్ 1 వికెట్ తీసుకున్నారు. ఈ పిచ్ పైన కేవలం 40 ఓవర్లలో 250 పరుగులు చేయడం అంత సులభం కాదు. ఈ పిచ్ పైన ముఖ్యంగా స్వింగ్, బౌన్స్ మరియు టర్న్ అన్నీ ఉన్నాయి. సో... చాలా జాగ్రత్తగా ఆడితేనే లక్ష్యాన్ని అందుకునే ఛాన్సెస్ ఉంటాయి.
కాగా ఇప్పటికే ఇండియా ఛేజింగ్ లో అయిదు ఓవర్ లలో కీలక వికెట్ శుబ్ మాన్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే లో వికెట్లు కాపాడుకుని, ఆ తర్వాత అటాక్ చెయ్యాలి. ఇక భారం అంతా కెప్టెన్ శిఖర్ మీదనే ఉంటుంది. మరి టీం ఇండియాను విజయం వైపుకు తీసుకు వెళ్తాడా లేదా తెలియాలంటే ఇంకాస్తసేపు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: