కోహ్లీ తగ్గేదేలే.. ఒక్క పోస్ట్ కి రూ. 8.9 కోట్లు?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  భారత్ లోనే కాదు ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఎంతలా తన ఆటతో ప్రభావితం చేశాడంటే.. ఏకంగా విదేశీ స్టార్ క్రికెటర్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తమ కుటుంబంలో ఉన్న క్రికెటర్ ని కాకుండా ఇక ప్రత్యర్థి జట్టు ఆటగాడు అయిన విరాట్ కోహ్లీని అమితంగా అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక మైదానంలోకి దిగాడు అంటే చాలు బౌలర్లు అందరికీ కూడా సింహా స్వప్నంలా మారిపోతూ భారీగా పరుగులు చేస్తూ ఉంటాడు.

 ఇప్పుడు వరకు తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఏ క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో రోజురోజుకీ తన క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు కేవలం అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ ఎవరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఏకధాటిగా చెబుతారు అది ఎవరో కాదు విరాట్ కోహ్లీ అని. మైదానంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా తాను కింగ్ అని ఇప్పటికే నిరూపించుకున్నాడు కోహ్లీ.

 ఇలా ఒకవైపు క్రికెట్లో మరోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగా సంపాదిస్తున్న విరాట్ కోహ్లీ ఇక సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాడు. కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ లో 215 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోని కోహ్లీ ఒక్కో ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి సుమారు 8.9 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడట. Hopperhq.Com అనే సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 400 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో ఒక్కో పోస్ట్ కి 19 కోట్లు తీసుకుంటున్నాడట. ఆ తర్వాత లియోనాల్ మెస్సి ఒక్క పోస్టుకి 14 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: