వారెవ్వా.. హనుమ విహారి.. సూపర్ సెంచరీ?

praveen
భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హనుమ విహారి . ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎన్నో సార్లు భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి తనదైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు అనే విషయం తెలిసిందే. కానీ గత కొంత కాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా గుర్తింపు రావడంతో ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్కు దూరమయ్యాడు. ఇటీవలే ఫామ్ కోల్పోవడంతో చివరి టెస్టు ఫార్మాట్లో జట్టుకు కూడా దూరం అయిపోయాడు.


 అయితే  మళ్లీ మునుపటి ఫామ్ లోకి వచ్చి ఇక భారత జట్టులో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగానే కష్టపడుతున్నాడు హనుమ విహారి. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశవాళీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీ 2022 లో భాగంగా ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇందులో భాగంగా ఇటీవల సౌత్ జోన్, నార్త్ జోన్  జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌత్ జోన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా సౌత్ జోన్ కెప్టెన్గా ఉన్న హనుమ విహారి 225 బంతుల్లో 107 పరుగులు చేసింది అదరగొట్టాడు. ఓపెనర్ రోహన్ 225 బంతుల్లో 143 పరుగులు చేశాడు.


 సౌత్ జోన్ లో ఉన్న ఇద్దరు ఓపెనర్లు కూడా సూపర్ శతకాలతో చెలరేగిన పోయారు అని చెప్పాలి. ఇక మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం 59 బంతుల్లో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు అని చెప్పాలి. ఇకపోతే ఇలా దేశవాళీ క్రికెట్ లో భాగంగా హనుమ విహారి వరుసగా సెంచరీలు చేస్తూ అదరగొడుతున్న నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోయారు అని చెప్పాలి. అతడు రానున్న రోజుల్లో ఇలాంటి ఫామ్ కంటిన్యూ చేస్తే తప్పకుండా భారత జట్టులో చోటు దక్కడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: