సచిన్.. మీరు కూడా ఇలా చేయడం ఏంటి?

praveen
క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్..  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఈయన  సాధించిన ఎన్నో రికార్డులు సచిన్ టెండూల్కర్ పేరు మారుమోగి పోయేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్  ఏదైనా సలహా ఇస్తే బాగుండు అని ఎంతోమంది యువ క్రికెటర్లు కోరుకుంటూ ఉంటారు అనే చెప్పాలి.  ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు.

 ఈ క్రమంలోనే  సలహాలను సూచనలను ఇస్తూ ఎంతో మంది యువ క్రికెటర్లకు తన అనుభవాన్ని మొత్తం పంచుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఎన్నో రోజుల తర్వాత ఇటీవలే మళ్లీ మైదానంలోకి దిగి ఆకట్టుకున్నాడు. ఇండియా లెజెండ్స్ కు నాయకత్వం వహిస్తున్న సచిన్ టెండూల్కర్ సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ 61 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

 ఇటీవల సచిన్ టెండుల్కర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. బ్యాట్ గ్రిప్ ని ఎలా శుభ్రపరచుకోవాలి ఈ వీడియోలో చూపించాడు. అంతా బాగానే ఉన్నా ఒక విషయంలో మాత్రం సచిన్ను తప్పుబట్టడం మొదలుపెట్టారు అభిమానులు  బ్యాట్ గ్రిప్ ని ఎలా క్లీన్ చేయాలో చెబుతూ ఎంతో నీటిని వృధా చేశాడు.. అయితే ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ముంబై సివిక్ బాడీ సేవ్ వాటర్ క్యాంపైన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అలాంటి సచిన్ ఇలా చేయడం ఏంటి అని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఈ విషయం పై కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: