బిగ్ బాస్ షో పై.. టైటిల్ విన్నర్ సన్నీ షాకింగ్ కామెంట్స్?
కొంతమంది విషయంలో ఇది నిజంగా నిజం అవుతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత అవకాశాలు అందుకుంటూ ఇక మరింత క్రేజ్ సంపాదించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వరకు కొనసాగి ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగైన వాళ్లు కూడా ఉన్నారు. అయితే గత సీజన్ కంటెస్టెంట్స్ కూడా ఇలాగే కనుమరుగయ్యారు అని చెప్పాలి. గత సీజన్లో కనిపించిన ఎంతో మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు అసలు వెండితెరపై బుల్లితెరపై కూడా కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ ఇటీవలే ఈ కార్యక్రమం పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బిగ్ బాస్ వెళ్లడానికి ముందు సీరియల్లో హీరో పాత్రలు చేసిన సన్నీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపిస్తూ ఉండేవాడు. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తన కెరీర్ కు బాగా కలిసి వస్తుందని అనుకున్నాడు. కానీ చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి సీజన్ విన్నర్గా నిలిచిన తర్వాత కూడా తనకు అవకాశాలు రావడం లేదు అంటూ వాపోతున్నారు. బిగ్ బాస్ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. అందుకే బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకోవడం కూడా మానేశాను. ఎంతమందిని కలిసినప్పుడు నేను బిగ్ బాస్ విన్నర్ అని చెబుతుంటే అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఈ షో వల్ల నాకు ఫేమ్ నేమ్ వచ్చాయి. ఈ విషయం కాదనను. కానీ అది నా కెరీర్కి ఉపయోగపడే లేదు. బిగ్ బాస్ విన్నర్ గా చెప్పుకోవడం మానేసి సొంతంగా సీరియల్స్ సినిమాలు చేయడం పైనే దృష్టి పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ.