సూపర్ ఫామ్ లో పసికూన.. బంగ్లా టైగర్స్ ని ఓడిస్తుందా ?
ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ తమ బౌలింగ్ మరియు బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో రషీద్ ఖాన్, ముజీబ్ మరియు నబి లతో కూడిన స్పిన్ అటాక్ ను తట్టుకోవడం బంగ్లాదేశ్ కు సవాలు అని చెప్పాలి. ఇక శ్రీలంక మ్యాచ్ లో హీరో ఫజలహఖ్ బౌలింగ్ ను తట్టుకుని నిలబడడం కష్టమే. గత మ్యాచ్ లో కూడా ఆఫ్ఘన్ గెలవడానికి ఒక కారణం పవర్ ప్లే లో వీలైనన్ని పరుగులు చేయడం. ఈ మ్యాచ్ లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది.
ఇక ఆసియా కప్ లో మొదటి మ్యాచ్ ఆడనున్న బంగ్లాదేశ్ ను షకీబ్ అల్ హాసన్ నడిపించనున్నాడు. ఈ టీం లో మిడిల్ ఆర్డర్ బలంగా ఉన్నా ఓపెనింగ్ తోనే సమస్య ఉంది. అంతగా అనుభవం లేని ఆటగాళ్లు ఉండడం తో ఆరంభంలో వికెట్లు పడితే కష్టం అయిపోతుంది. కాబట్టి ఆఫ్ఘన్ ను పసికూన నాయి తేలిగ్గా తీసుకోకుండా ఆడితే విజయం దక్కుతుంది. మరి ఫామ్ లో ఉన్న ఆఫ్ఘన్ ను బంగ్లా అడ్డుకుంటుందా లేదా మరో విజయాన్ని ఆఫ్ఘన్ కు ఇస్తుందా అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.