మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని.. గిల్ ఎవరికి అంకితమిచ్చాడో తెలుసా?
ఇక ఈ తొలి సెంచరీ కారణంగా ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేస్తూ అతి చిన్నవయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ జింబాబ్వేపై ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ గా అరుదైన రికార్డు కాతాలో వేసుకున్నాడు అంతే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డులను తన తండ్రికి అంకితం ఇస్తున్నాను అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.
97 బంతుల్లో 15 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 130 పరుగులు చేశాడు శుభమన్ గిల్. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ నేను నా డాట్ బాల్ శాతాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే కాకుండా ఇక సరైన సమయంలో బంతిని కొట్టేందుకు ప్రయత్నించాను. ఒక బ్యాట్స్‌మెన్‌గా సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. నేను 90 పరుగులను మూడుసార్లు దాటాను. కానీ సెంచరీ చేయలేకపోయాను. నా ప్రాథమిక కోచ్‌గా ఉన్న మా నాన్నకి ఇక ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. ఇక అవార్డులను తన తండ్రికి అంకితం ఇవ్వడం పై శుభమన్ గిల్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.