కోహ్లీ వైఫల్యంపై.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం అందరి కన్ను మరికొన్ని రోజుల్లో ఆసియా కప్లో భాగంగా ప్రారంభం కాబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైన ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ సుదీర్ఘ విశ్రాంతి తర్వాత మళ్లీ ఆసియా కప్లో టీమ్ ఇండియా తరపున బరిలోకి దిగబోతున్నాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ మెగా ఈవెంట్లో చెలరేగాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అదే సమయంలో ఇక ఆసియా కప్ లో కూడా అదే వైఫల్యాన్ని కొనసాగిస్తే తమ ఆరాధ్య క్రికెటర్ భవిష్యత్తు  ఎటువైపు వెళ్తుందో అని అభిమానులలో కూడా కలవరం మొదలైంది అని చెప్పాలి.ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు షాహిద్ అఫ్రిది కూడా కోహ్లీ భవితవ్యం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ నిర్వహించాడు.


 కోహ్లీ వరుస వైఫల్యాలపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ  ఒక నెటిజన్ అడగగా.. విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం అనే విషయం అతని చేతుల్లోనే ఉంది అంటూ షాహిద్ అఫ్రిది సమాధానమిచ్చాడు.  ఇక కోహ్లీ సెంచరీ చేసి వెయ్యి రోజులు పూర్తయింది కదా అంటూ అడుగగా.. కఠిన  సమయాల్లోనే ఆటగాళ్ల గొప్పతనం బయటపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే అటు ఆసియా కప్లో భాగంగా ఒక వైపు టీమిండియాకు కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోవైపు పాకిస్థాన్కు స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది దూరం అయ్యారు అని చెప్పాలి. ఇరు జట్లు కూడా కీలక బౌలర్ లేకుండానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: