క్రికెట్ దేవుడు సచిన్ రికార్డును బద్దలు కొట్టిన శుబ్ మాన్ గిల్ !
ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ స్థితిలో శుబ్ మాన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ లు మూడవ వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ సైతం అర్ద సెంచరీ సాధించిన అనంతరం రన్ అవుట్ గా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ కు క్రీజులో నిలబడి అద్బుతమయిన సెంచరీని చేశాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు పోతున్న గిల్ జింబాబ్వే పైన సెంచరీ చేయడమే కాకుండా అత్యధిక పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మన్ గా రికార్డు సృష్టించాడు. ఈ దశలో ఇంతకు ముందు జింబాబ్వే మీద జింబాబ్వే లో క్రికెట్ దేవుడు అని మనము అంతా అభిమానించే సచిన్ టెండూల్కర్ 127 పరుగుల రికార్డును శుబ్ మాన్ గిల్ 130 పరుగులు చేసి అధిగమించాడు.
ఇతను ఈ స్కోర్ ను కేవలం 97 బంతులు ఆడి సాధించాడు. మొత్తం 15 ఫోర్లు మరియు 1 సిక్సర్ సాధించి భారత అభిమానులు గర్వపడేలా చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో టీం ఇండియా నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి కష్టమైన లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది.