ముంబై వీధుల్లో.. స్కూటీపై విరాట్ కోహ్లీ జంట?
ఏకంగా స్కూటీపై చెక్కర్లు కొట్టారు. అదేంటి విరాట్ కోహ్లీ దగ్గర కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉండగా ఈ జంట స్కూటీపై ప్రయాణించటం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. అదికూడా ముంబై వీధుల్లో అని ఆశ్చర్య పోతున్నారు కదా.. కానీ నిజంగానే ఇలా స్కూటీపై చక్కర్లు కొట్టి అభిమానులందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట. దీంతో అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ స్కూటీ నడుపుతుండగా వెనక అనుష్క శర్మ కూర్చొని ఉంది. అయితే వీరిద్దరూ తమ ముఖం కనిపించకుండా హెల్మెట్ ధరించారు.
కానీ విరాట్ కోహ్లీనీ ఎంతగానో అభిమానించి ఆరాధించే అభిమానులు మాత్రం అతని గుర్తుపట్టేస్తారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ స్కూటర్ పై వెళుతున్న సమయంలో వీడియోలు ఫోటోలు తీశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోతున్నాయి అనే చెప్పాలి. కాగా ఇంగ్లండ్ పర్యటన తర్వాత విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక యూఏఈ వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఆసియా కప్లో భాగంగా మళ్లీ జట్టుతో చేరబోతున్నాడు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఒక సినిమాతో బిజీగా ఉంది.