సరిగ్గా ఇదే రోజు.. సచిన్ సెంచరీల వేట మొదలైంది?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్నారు సచిన్ టెండూల్కర్. దాదాపు ఇరవై రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించి భారత జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. ఇటీవలి కాలంలో ఎంతో మంది యువ క్రికెటర్లకు సచిన్ టెండూల్కర్  ఒక స్ఫూర్తిగా నిలిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో ఎన్నో రికార్డులు క్రియేట్  చేసాడు. అయితే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి అతను క్రియేట్ చేసిన రికార్డులు మాత్రం అంతర్జాతీయ క్రికెట్ లో ఇంకా పదిలంగానే ఉన్నాయి.

 ఈ క్రమంలోనే అప్పట్లో ఉన్న ఎంతోమంది దిగ్గజ బౌలర్లను సైతం ఎంతో అలవోకగా ఎదుర్కొంటూ చుక్కలు చూపించాడు సచిన్ టెండుల్కర్. అందుకే ప్రేక్షకులు అందరితో కూడా మాస్టర్ బ్లాస్టర్ అని పిలిపించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే 17 ఏళ్ళ 12 రోజుల వయస్సు నుండే రికార్డులు కొల్లగొట్టడం మొదలుపెట్టాడు.  ఈ క్రమంలోనే ఎన్నో సెంచరీలతో చెలరేగిన సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లోనే మొదటి సెంచరీ ఇదే రోజు చేశాడు అని చెప్పాలి. 17 ఏళ్ల 12 రోజుల వయసులో 1990 ఆగస్టు 14వ తేదీన ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్.

 17 ఏళ్ల వయసులో తన కెరియర్ లో 9వ టెస్ట్ మ్యాచ్ ఆడిన సచిన్ టెండూల్కర్ 189 బంతులు ఆడి 119 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో సచిన్ సెంచరీతో చెలరేగినప్పటికీ మిగతా ఆటగాళ్లు నుంచి సరైన తోడ్పాటు లేకపోవడంతో చివరి మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే అప్పట్లో అతి చిన్న వయసులో టెస్టు సెంచరీ సాధించిన మూడవ ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించారు. కాగా నేడు ఆగస్టు 14వ తేదీ కావడంతో ఇక అప్పట్లో సచిన్ టెండూల్కర్ చేసిన మొదటి సెంచరీ ని అభిమానులు నెమరు  వేసుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: