ఏడాదికి రెండు ఐపీఎల్ లు : రవి శాస్త్రి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశీ ఆటగాళ్లు పోటీపడి మరీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇటీవలే జరిగిన ప్రసార హక్కుల వేలం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హవా మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ లీగ్ లలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా టి20 క్రికెట్కు ఆదరణ పెరిగిపోయిందని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
త్వరలో రెండు భారత టి20 లీగ్ లను మీరు చూడబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. నాకైతే ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడున్న ఫార్మాట్ ప్రకారమే రానున్న రోజుల్లో కూడా పూర్తి సీజన్ ఉంటుంది. 10 లేదా 12 జట్లతో రెండున్నర నెలలపాటు మ్యాచ్లు జరగనున్నాయి. ఒకవేళ ద్వైపాక్షిక సిరీస్ లను తగ్గిస్తే ఇక భారత్ లో ఐపీఎల్ రెండు సీజన్ లు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్ ఫార్మాట్ ఎలాగైతే ఉంటుందో ఆ పద్ధతిలోనే ఐపీఎల్ నిర్వహించే ఛాన్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సప్లై డిమాండ్ సూత్రం ప్రకారం ఇది సాధ్యమవుతుందని రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు.