పాక్ బౌలర్ విచిత్రమైన డాన్స్.. వీడియో వైరల్?

praveen
సాధారణంగా ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంత మంది ఆటగాళ్లు మ్యాచ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తోటి ఆటగాళ్లతో కలిసి చిన్న చిన్న డాన్స్ స్టెప్పులు వేయడం సినిమా డైలాగులు చెప్పుకోవడం లాంటివి కూడా అప్పుడప్పుడు మైదానంలో చూస్తూ ఉంటాము. క్రికెటర్లు ఎవరైనా ఇలాంటివి చేశారు అంటే అదే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

 గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం ఎంతో మంది అభిమానులను ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఏదో విషయం పై చర్చిస్తున్న సమయంలో కాసేపు చేతులు ముందు పెడుతూ డాన్స్ మూమెంట్స్ చేసాడు హసన్ అలీ. అయితే ఇలా హసన్ అలీ  చేసిన డ్యాన్స్ మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది అని చెప్పాలి. ఇక ఇది గమనించిన కామెంటేటర్ డానిసన్ మోరిసన్ అంతుపట్టని డాన్స్ తో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో భాగంగా హసన్ అలీ 12 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో భాగంగా 222 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌట్ కావడం గమనార్హం. అయితే కెప్టెన్ బాబర్ వీరోచితమైన సెంచరీ చేయడంతో తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం నుండి  పాకిస్థాన్ జట్టు బయటపడింది  అని చెప్పాలి. ఇలా శ్రీలంక పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: