బాబర్ ట్విట్ కు కోహ్లీ రిప్లై.. ఏమన్నాడో తెలుసా?

praveen
గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతను వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిపోతున్నాడని.. అతన్ని జట్టు నుంచి తప్పించాల్సిన సమయం ఆసన్నమైందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక మరికొంతమంది మరికొన్ని రోజుల్లో విరాట్ కోహ్లీ మునుపటి ఫాం అందుకు ఉంటాడని మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొడుతూ ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సైతం విరాట్ కోహ్లీ కి మద్దతుగా ట్విట్టర్ వేదికగా   స్పందించడం హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 కష్ట సమయంలో ధైర్యంగా ఉండు అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు బాబర్.  విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన బాబర్ ప్రతి ఒక ప్లేయర్ కి ఇలాంటి దశ ఉంటుందని.. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆటగాడికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని.. అందుకే కోహ్లీ కి మద్దతుగా ట్వీట్ చేశా అంటూ చెప్పుకొచ్చాడు. అతను ఒక గొప్ప ఆటగాడని.. త్వరలో కఠిన పరిస్థితులను నుంచి బయటికి వస్తాడు అని.. మళ్లీ మునపటిలా ఫామ్ లోకి ఎలా రావాలో కోహ్లీకి బాగా తెలుసు.. కాకపోతే కొంత సమయం పడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు.

బాబర్ అజాం ట్విటర్ వేదిక కోహ్లీ కి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో అటు కోహ్లీ బాబర్ అజాం ట్వీట్ పై స్పందిస్తాడో లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ఇటీవలే బాబర్ కు రిప్లై ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ధన్యవాదాలు.. నిరంతరం బాగా రాణిస్తు.. ఇంకా పైకి ఎదగాలి.. నీకు ఆల్ ద బెస్ట్ అంటూ చప్పట్లు కొడుతున్న ఎమోజి జోడించి ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఇలా బాబర్ అజాం కు విరాట్ కోహ్లీ రిప్లై ఇవ్వడం కాదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: