చూడ్డానికి బాగున్నా.. అది బౌలర్లకు భయానకం : అశ్విన్
ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్.. ఇక కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్ టెస్టు జట్టు ఎంతో ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా లక్ష్య ఛేదన పూర్తి చేస్తోంది. దీనిని బజ్ బాల్ అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం అటు ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక ఇదే విషయంపై ఎంతో మంది సీనియర్ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టులో కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై స్పందించాడు.
ఇలాంటి దూకుడైన ఆటతోనే ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని సూచించాడు. క్రికెట్ లో దూకుడైన ఆటను చూడటం బాగుంది. అయితే ఒక బౌలర్గా మాత్రం ఇది ఆందోళన కలిగించే విషయమే. ఇంగ్లాండ్ వేగంగా పరుగులు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలి. ఎందుకంటే అక్కడ పిచ్ పాత్ర ఎంతో ముఖ్యమైనది ఇక ఇలాంటి పద్ధతి ముందుకు తీసుకెళ్లాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. గత కొంతకాలం నుంచి అయితే టెస్టు ఫార్మాట్ ఒకేలా కొనసాగుతూ వస్తోంది.. అంతేకాదు దూకుడైన క్రికెట్ను ఎల్లకాలం ఆడగలమా అన్నది కూడా ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్న అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.