ఇంగ్లాండ్ దానికి అలవాటు పడాలి : కోచ్ మెకల్లమ్

praveen
ఇటీవలే భారత్ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన ప్రతిష్ఠాత్మకమైన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం చేసిన ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే భారత జట్టుపై ఇప్పటివరకు 378 పరుగుల భారీ టార్గెట్ ను చేదించిన జట్టే లేదు. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఇది సాధించి చూపెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టెస్ట్ క్రికెట్లో కూడా ఎంతో దూకుడైన ఆటతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను అందరిని ఆశ్చర్యపరిచారు. భారత బౌలర్లపై ఎటాకింగ్ పద్ధతిలో సిక్సర్లు పూలతో విరుచుకుపడ్డారు.

 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్  ప్రదర్శన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ కోచ్గా మారిన తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మరింత దూకుడు పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. భారీ టార్గెట్ సైతం ఎంతో అలవోకగా చేదించచగలుగుతుంది. కేవలం భారత మీదే కాదు అంతకు ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్పై కూడా మూడు టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేసి అదరగొట్టింది ఇంగ్లాండ్. ఈ క్రమంలోని  ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు ఆటతీరుపై  స్పందించాడు ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్.

 ఈ విజయాలతో  తాము పొంగిపోము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ దూకుడైన ఆటతీరును  తమ ఆటగాళ్లు ఒక అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు అంటూ తెలిపాడు. నేను బాధ్యతలు చేపట్టి నెల రోజులు అయింది. ఈ నెలలో గొప్ప ఫలితాలు వచ్చాయ్. అయితే ఈ విజయాలు ఇంకా ముందు ఇలాగే కొనసాగాలి. అయితే ఈ కొత్త పద్ధతి పై పూర్తి పట్టు సాధించాల్సి అవసరం ఉంది. ఏ స్థితిలో అయినా ఇలా దూకుడుగా ఆడాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన ప్రదర్శన చేసేలా జట్టు రూపుదిద్దుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: