ఐపీఎల్ ప్లేయర్స్ పారితోషికం రూ.400.. ఈ విషయం తెలుసా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే గత 15 ఏళ్ల నుంచి ఈ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆదరిస్తూ ఎంతోమందికి ఫేవరేట్ గా మారిపోయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశీ ఆటగాళ్లు సహచరులుగా మారిపోయి ఆడే ఈ టోర్నీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇకపోతే  అచ్చం ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఇటీవలే నకిలీ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు గుజరాత్ పోలీసులు. ఇది కాస్త దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 గుజరాత్ లోని మొహ్హానా జిల్లా మోలి పూర్ గ్రామంలో  ఐపీఎల్ పేరిట ఫేక్ మ్యాచ్ లు నిర్వహిస్తూ యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓ మంచి టెక్నాలజీని ఉపయోగించి అచ్చం ఐపీఎల్ తరహాలోనే మ్యాచ్ లను ప్రసారం  చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే విదేశాల్లోని బెట్టింగ్ రాయుళ్లకు గాలం వేస్తోంది  ముఠా. ఐపీఎల్ లో భాగంగా వ్యవసాయ కూలీలను ఆటగాళ్ళు మార్చి చూపించారు. అయితే ఇలా ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు ఒక్కో మ్యాచ్కు 400 రూపాయల రెమ్యూనరేషన్ చెల్లించారట. వ్యవసాయ కూలీలు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి జట్ల జెర్సీలు ధరించి నిజమైన ఆటగాళ్లలా బిల్డప్ ఇస్తూ ఉంటారు.

 ఐపీఎల్ లో అంపైర్లు కూడా అచ్చం నిజమైన అంపైర్లు  కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఫోజులు కొడుతూ అందరినీ నమ్మిస్తూ ఉంటారు  ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్వరాన్ని కూడా ఇమిటేట్ చేస్తూ కామెంట్ చేయడం ఈ నకిలీ ఐపీఎల్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ నకిలీ ఐపీఎల్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ కు కూడా చేరిందట. రష్యా లోని పలు ప్రాంతాల నుంచి ఎంతోమంది  బెట్టింగులు పాల్పడుతున్నారన్న విషయం బయటకు వచ్చింది. అయితే ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన క్రికెట్ లోనే చర్చనీయాంశంగా మారి పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: