రోహిత్ కు షాక్.. వరుస విజయాలకు బ్రేక్?
ఈ క్రమంలోనే మూడో మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మూడో మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమి తప్పలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మకు ఊహించని షాక్ తగిలింది. వరుస విజయాలకు బ్రేక్ పడింది కెప్టెన్ గా మారిన తర్వాత వరుసగా 19 విజయాలు సాధించి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ చివరికి 20వ మ్యాచ్ లో మాత్రం ఇండియాను గెలిపించుకోలేక పోయాడు. దీంతో ఓటమి ఎరుగని కెప్టెన్గా కొనసాగిన రోహిత్ శర్మకు నిరాశ తప్పలేదు అని చెప్పాలి.
అదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వరుసగా 20 విజయాలు సాధించిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉండిపోయింది. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వరుసగా 14 టి20 లు గెలిచింది. న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్లో క్లీన్స్వీప్.. వెస్టిండీస్తో జరిగిన వన్డే టి20 సిరీస్ లను కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఇక శ్రీలంక తో ఆడిన టెస్టు టి-20 సిరీస్ లను వైట్వాష్ చేసేసింది టీమిండియా. ఇక ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో సిరీస్ గెలిచినప్పటికీ అటు టీమిండియా మూడో మ్యాచ్లో ఓడిపోవడంతో రోహిత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.