రిషబ్ పంత్ బ్యాటింగ్.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
టీమిండియాలో కి ధోని వారసుడు అంటూ ఒక ట్యాగ్ తగిలించుకొని ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే ధోని లాగానే వికెట్ కీపర్ కావడం మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఉండడంతో ఇక ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడు అని అందరూ భావించారు. అయితే మొదట్లో తన ప్రదర్శనతో నిరాశ పరిచిన రిషబ్ పంత్  తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.ఫార్మట్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం భారత జట్టులో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం సరైన ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు.


 వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న రిషబ్ పంత్ ఆ స్థాయిలో ప్రదర్శన మాత్రం చేయలేక పోయాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో కూడా పెద్దగా తన ప్రదర్శన తో ఆకట్టుకోలేక పోయాడు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేస్తున్న వారందరికీ కూడా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు రిషబ్ పంత్. టి20 తరహాలో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 146 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా 57 పరుగులతో రాణించాడు.



 ఈ క్రమంలోనే ఎంతో దూకుడుగా ఆడే రిషబ్ పంత్ ను ఐదవ స్థానంలో కాకుండా ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా తరపున గిల్ క్రిస్ట్ వైట్ బాల్ క్రికెట్ ఎలా ఆడాడో.. ఇక ఆరు ఏడు స్థానాల్లో వచ్చి టెస్టుల్లో కూడా విధ్వంసం సృష్టించేవాడు  అంటూ సునీల్ గవాస్కర్ గుర్తుచేశాడు. అతడి లాగానే ప్రస్తుతం టీమిండియాకు రిషబ్ పంత్  ఉన్నాడని ఎక్కువ ఓవర్లు ఆడే చాన్స్ వస్తే రిషబ్ పంత్ కూడా అదే విధ్వంసం సృష్టిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.  అందుకే అతన్ని టి20 లలో ఓపెనర్ గా పంపితే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: