వారెవ్వా.. చరిత్ర సృష్టించిన దీపక్ హుడా, సంజు శాంసన్ జోడి?
అదే సమయంలో మరో ఎండ్ లో ఉన్న సంజు శాంసన్ ఇక జట్టులో చోటు సంపాదించుకున్న తర్వాత తన బ్యాటింగ్ సామర్ధ్యం నిరూపించుకోవాలని భావించాడు దీంతో ఇక తన ముందు ఉన్న దీపక్ హుడా కంటే తాను ఏమీ తక్కువ కాదు అంటూ నిరూపించుకున్నాడు. తక్కువ బంతుల్లోనే ఏకంగా 77 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు సంజూ శాంసన్. ఈ క్రమంలోనే టీమిండియా దాదాపు 200 కు పైగా స్కోరు చేయడం లో ఇద్దరు బ్యాట్స్మెన్ లదే కీలకమైన పాత్ర ఉంది అని చెప్పాలి. అయితే ఇలా మెరుగైన పరుగులు చేసి రాణించిన ఇద్దరు బ్యాట్స్మెన్ లు కూడా భారత క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాళ్లుగా సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకున్నారు. దీపక్ హుడా, సంజూ శాంసన్. ఇక ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో ఇద్దరు బ్యాట్స్మెన్ కలిపి బౌలర్ల పై వీరవిహారం చేయడంతో ఇక రెండో వికెట్కు 176 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. అయితే టి-20లో భారత జట్టు తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఇక గతంలో శ్రీలంకపై 2017 సంవత్సరంలో రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం గా కొనసాగుతుంది. అంతకుముందు రోహిత్ శర్మ - శిఖర్ ధావన్ 160 పరుగులు, రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ 158 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం గమనార్హం.