కోహ్లీకి షాకిచ్చిన సెహ్వాగ్.. టాప్ 3 లో నో ఛాన్స్?

praveen
ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో పదునైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. అదే సమయంలో ఇక అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 వరల్డ్ కప్ కి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ఎవరికీ స్థానం కల్పిస్తే బాగుంటుంది అన్న విషయంపై కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

కాగా ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ టి20 వరల్డ్ కప్ కోసం వెళ్లబోయే భారత జట్టు ఎలా ఉండాలనే దానిపై పలుమార్లు తన భావాలను వ్యక్తపరిచారు. ఇప్పుడు మరోసారి టి20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా టాప్ 3 బ్యాట్స్మెన్లను మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్న టాప్ త్రీ టీమిండియా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్, కె.ఎల్.రాహుల్, రోహిత్ శర్మలు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అనూహ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మూడవ స్థానంలో అటు వీరేంద్ర సెహ్వాగ్ చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

 అయితే విరాట్ కోహ్లీ రెగ్యులర్గా మూడవ స్థానంలో బ్యాటింగ్కు దిగుతూ ఉంటాడు  అన్న విషయం తెలిసిందే. భారత జట్టులో చాలా మంది హార్డ్ హీటర్లు ఉన్నారు. కాబట్టి మ్యాచ్ ఫినిషింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక టాప్ త్రీ లో రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ కె.ఎల్.రాహుల్ ఉండాలని అనుకుంటున్నాను. రోహిత్, ఇషాన్  కిషన్ ఓపెనర్లుగా వస్తే  బాగుంటుంది లేదా ఇశాన్ కిషన్ తో పాటు కె.ఎల్.రాహుల్ ఓపెనర్ గా వచ్చినా కూడా అటు టీమిండియాకు మంచి ఆరంభం  లభిస్తుంది అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక తనను ఎంతగానో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ జస్ప్రిత్ బూమ్రా షమీ  లతో కలిసి టీమిండియా జట్టులో భాగం కావాలి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: