కోహ్లీ.. నా ఫోటోలు వాడుకున్నందుకు థాంక్స్?

praveen
మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ పేలవమైన కొనసాగించాడు. కనీస పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశ పరిచాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి కొన్నాళ్లపాటు భారత సెలెక్టర్లు రెస్టు ఇచ్చారు. అయితే కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అని తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే జూలై 1వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని రోజుల ముందు నుంచే లిస్టర్ షేర్ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది టీమిండియా.

 ఇక ఈ వార్మప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 37 పరుగులు  రెండవ ఇన్నింగ్స్ లో 67 పరుగులు చేసి మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపించాడు. దీంతో ఇక జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడటం ఖాయం అంటూ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అని చెప్పాలి. అయితే వార్మప్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ పలు ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ లిస్టర్ షేర్ కు ధన్యవాదాలు చెప్పడమే కాకుండా బర్మింగ్హామ్ టెస్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

 అయితే విరాట్ కోహ్లీ లిస్టర్ షేర్ తో ఆడిన ఫోటోలను పంచుకోవడంతో అవి చూసిన ఒక ఫోటోగ్రాఫర్ తెగ సంబరపడిపోతున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే సదరు ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలనే విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ క్రమంలోనే సదరు ఫోటోగ్రాఫర్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రపంచ  క్రికెట్ లో గొప్ప ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన ఫోటోలను వాడుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ట్విట్ చేశాడు. ఆ ఫోటోలను తీయడం గర్వంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి బిసిసిఐకి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: