రోహిత్ కెప్టెన్సీ వదిలేయాలి : సెహ్వాగ్

praveen
అనూహ్య పరిణామాల నేపథ్యంలో విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసాడు  ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ తర్వాత అటు రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్సీ చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి కెప్టెన్   రోహిత్ శర్మ బాధ్యతలు అయితే స్వీకరించాడు కానీ అటు పూర్తిస్థాయి కెప్టెన్గా జట్టుకు అందుబాటులో మాత్రం ఉండడం లేదు.  స్వదేశంలో టీమిండియాను సమర్థవంతంగా ముందుకు నడిపించి వరుస విజయాలు అందించిన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా సిరీస్కు భారత జట్టు వెళ్లిన సమయంలో మాత్రం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

 ఇలా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి ఇప్పటివరకు పూర్తిస్థాయి కెప్టెన్ గా మాత్రం రోహిత్ శర్మ బరిలోకి దిగ లేకపోయాడు అనే చెప్పాలి. ఇక ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ బారిన పడి చివరికి జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో  ఐపీఎల్  లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ టి20 కెప్టెన్సీ గురించి మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయ్.

 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ టి20 ఫార్మాట్ కి కొత్త కెప్టెన్ ఫలానా వ్యక్తి అని భారత జట్టు సెలెక్టర్ ల మదిలో ఎవరి పేరు ఏమైనా ఉంటే కచ్చితంగా రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి. ఇలా తప్పించడం ద్వారా ఒకటి రోహిత్ శర్మ పై పని భారం తగ్గుతుంది. రోహిత్ శర్మ వయస్సు దృశ్య ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే రోహిత్ శర్మ తో కావాల్సినంత విశ్రాంతి కూడా దొరుకుతుంది  తద్వారా టెస్టులు వన్డేలపై మరింత దృష్టి సారించి ముందుకు నడిపించేందుకు అవకాశం ఉంటుంది అని  వీరేంద్ర సెహ్వాగ్  చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: