అద్భుతమైన క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే?

praveen
సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చే క్యాచ్ లు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. దాదాపు క్యాచ్ పట్టడం అసాధ్యం అని ప్రేక్షకులు అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్ లను ఒడిసిపట్టి ఫీల్డర్లు తన సత్తా చాటుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా అసాధ్యమైన క్యాచ్ లను పట్టాలని అందరూ ప్రయత్నిస్తారు. కాని కొంతమంది సఫలమైతే మరి కొంతమంది విఫలం అవుతూ  ఉంటారు అని చెప్పాలి. కొంతమంది అయితే ఏకంగా స్పైడర్ మాన్ లాగ గాల్లోకి లేచి క్యాచ్ లు అందుకోవడం కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము.

 అయితే ఇక్కడ జరిగిన ఘటన కూడా సరిగ్గా ఇదే కోవకు చెందినది అని మాత్రం అర్థం అవుతుంది అని చెప్పాలి. ఉగాండా కు చెందిన ఒక సీనియర్ ఆటగాడు అద్భుతమైన క్యాచ్ అందుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. 41ఏళ్ళ వయసులో అతను ఎంతో రిస్క్ చేసి క్యాచ్ అందుకున్న తీరు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు అని చెప్పాలి. చాలెంజ్ లీగ్ గ్రూప్ బి లో భాగంగా కెన్యా వర్సెస్ ఉగాండా మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఫీల్డర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారి పోవడం తో ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను అటు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో చూసుకుంటే ఈ ఆటగాడు మిడ్ వికెట్ వద్ద నిలబడి ఉన్నాడు. బ్యాట్స్మెన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఇక బంతి తనకంటే వెనకాలకు దూసుకెళ్ళింది. అయితే 41 ఏళ్ల ఆటగాళ్ళు బంతిని పట్టుకోవడానికి వెనుకకు పరిగెత్తి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు అని చెప్పాలి. అయితేట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూస్తే మాత్రం మీరు వావ్ అనకుండ ఉండలేరు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: