గల్లీ క్రికెట్లా టీమిండియా మ్యాచ్.. ఔట్ అయినా బ్యాటింగ్ చేశారు?

praveen
సాధారణంగా గల్లీ క్రికెట్ లో ఒక సారి ఔట్ అయినా ఆటగాడు ఇక మళ్ళీ బ్యాటింగ్ చేయడం లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఇలాంటివి జరగవు అని చెప్పాలి. కానీ ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది. భారత జట్టు జులై 1వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ కు ముందు లీస్టర్ షైర్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. ఇక ఈ వార్మప్ మ్యాచ్లో భాగంగా ఎన్నో వింతలు చోటుచేసుకుంటాయని చెప్పాలి.

 టీమిండియా నయా వాల్ గా గుర్తింపు సంపాదించుకున్న చటేశ్వర్ పుజారా మొదటి ఇన్నింగ్స్ లో లిస్టర్ షైర్ తరఫున ఇక రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా తరఫున ఆడాడు. ఇక ఇలాంటివి గల్లీ క్రికెట్ లోనే జరుగుతూ ఉంటాయి. ఇండియా బ్యాట్స్మెన్ లు రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ లు సైతం రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోయారు. కానీ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించి అర్థసెంచరీలు స్కోర్ చేయడం గమనార్హం. ఇది కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే వార్మప్ మ్యాచ్ కావడంతోనే టీమిండియా ఆటగాళ్లు రూల్స్ ని పక్కకు పెట్టి ఇక ప్రాక్టీస్ లో మునిగితేలారు అనేది తెలుస్తుంది.

 అదే సమయంలో శుభమాన్ గిల్ సైతం మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తరఫున ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం లీస్టర్ షైర్ జట్టు తరఫున బరిలోకి దిగాడు అని చెప్పాలి. వార్మప్ మ్యాచ్లో భాగంగా భారత ఆటగాళ్లు సాధ్యమైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ లో కొనసాగే విధంగా ప్రాక్టీస్ చేశారు. ఇకపోతే తొలి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇక అతను జులై 1వ తేదీ నాటికి కోలుకోక పోతే జస్ప్రిత్ బూమ్రా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: