
టీమిండియాకు కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?
ఇక చివరి టెస్టు మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తున్న నేపథ్యంలో అటు భారత జట్టుకు మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీమిండియా లో కీలక ఆటగాళ్లు కొనసాగుతున్న వారు వరుసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ వైరస్ బారిన పడ్డారు.. ఇక రోహిత్ శర్మ వైరస్ బారిన పడిన నేపథ్యంలో ఇక టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇక ఇలాంటి సమయంలోనే అటు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు అన్నది ఆసక్తి కరం గా మారిపోయింది. రోహిత్ కరోనా వైరస్ బారిన పడటం ఇక వైస్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ గాయం కారణంగా మ్యాచ్ దూరమవడంతో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే గనుక జరిగితే దాదాపు 35 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక ఫాస్ట్ బౌలర్ చేతికి వచ్చినట్లు అవుతుంది. ఇప్పటివరకు కపిల్ దేవ్ మినహా ఏ ఫాస్ట్ బౌలర్ కూడా టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ చేపట్టలేదు.