ఐసిసి టీ20 ర్యాంకింగ్.. సత్తా చాటిన దినేష్ కార్తీక్?

praveen
చాలా ఏళ్ళపాటు టీమిండియాలో అవకాశం కోసం ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్న సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఇటీవలికాలంలో ఐపీఎల్ లో అదరగొట్టి టీమిండియా లో అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన కెరీర్ ముగిసిపోయింది అని అతను రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంది అంటూ డిమాండ్ చేసిన ఎంతోమంది ఇప్పుడు అతని ప్రదర్శనతో నోరు మూసుకునే పరిస్థితితీసుకు వచ్చాడు దినేష్ కార్తీక్. ఇలా ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున సూపర్ ఫినిషెర్ గా మారిపోయిన దినేష్ కార్తీక్ అటు టీమిండియా తరపున కూడా అదే రేంజిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఆదరగొట్టేస్తున్నాడు.

 ఇటీవల సొంత గడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఆడిన టి20 సిరీస్ లో టీమిండియాలో దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు అన్న విషయం తెలిసిందే.  వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని అందుకోసం ఎంతో శ్రమిస్తాను అంటూ చెబుతున్నాడు.  ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఇక ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి.

 ఇన్నింగ్స్ చివర్లో తనదైన శైలిలో చెలరేగి మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర వహించాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్ లో దినేష్ కార్తీక్ నూట ఎనిమిది స్థానాలు ఎగబాకి ఎనబై ఏడవ స్థానానికి చేరుకున్నాడు అని చెప్పాలి.  ఇక ఇదే సిరీస్లో రెండు అర్ధ సెంచరీలతో అలరించిన ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరవ స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు బాబర్ అజం,  మహ్మద్ రిజ్వాన్ లు వరుసగా 12 స్థానాల్లో కొనసాగుతూ ఉండడం గమనార్హం.  బౌలర్ల జాబితాలో చాహల్ 3 స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.. టెస్టుల్లో ఆల్రౌండర్ల విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: