ఇంగ్లాండ్ జట్టుకు షాక్.. జట్టు నుండి కెప్టెన్ ఔట్?

praveen
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ తో వరసగా టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగుతోంది.  కాగా వరుసగా వైఫల్యాలను ఎదుర్కొన్న జో రూట్ ఇటీవలే ఇంగ్లాండ్ కెప్టెన్సీ పగ్గాలు బెన్ స్టోక్స్ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ ప్రస్తుతం అద్భుత ఫలితాలను రాబడుతుంది అని చెప్పాలి.  ఇదిలా ఉంటే మూడవ టెస్ట్ మ్యాచ్ కు ముందు అటు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది.

 ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు.  ఈ క్రమంలోనే ఇక జట్టు సభ్యులందరూ కూడా ఇటీవలే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నప్పటికీ అటు బెన్ స్టోక్స్ మాత్రం జట్టుకు దూరంగానే ఉన్నాడు. అయితే అతనికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగబోయే మూడవ టెస్ట్ తో పాటు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ మ్యాచ్ కి కూడా బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండే అవకాశం లేదని ప్రస్తుతం అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి అని చెప్పాలి.

 అయితే బెన్ స్టోక్స్ కి సారథ్య బాధ్యతలు అప్పగించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇక వైస్ కెప్టెన్ గా ఎవరిని నియమించక పోవడం గమనార్హం ఈ క్రమంలోనే సుఖం అస్వస్థత కారణంగా బెన్ స్టోక్స్ దూరం కావడంతో  మళ్ళి జో రూట్ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు  అందుకోబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇక బెన్ స్టోక్స్  తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తమ క్రికెటర్ త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు అని చెప్పాలి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా 1 టెస్ట్ తో పాటు వన్డే టి20 సిరీస్ కూడా ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: