అయ్యో పాపం.. రిషబ్ పంత్ ఖాతాలో అవమానకరమైన రికార్డు?
దీంతో ఒక అవమానకరమైన రికార్డును రిషబ్ పంత్ ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఒక ద్వైపాక్షిక సిరీస్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు టాస్ ఓడిపోయినా తొలి కెప్టెన్ గా ప్రపంచ క్రికెట్ లోనే చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు రిషబ్ పంత్. మహిళల పురుషుల క్రికెట్ లో కూడా ఇలా ఇన్నిసార్లు టాస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా వరుసగా ఐదు మ్యాచ్ లలో టాస్ ఓడిపోయినా కెప్టెన్ రిషబ్ పంత్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. రిషబ్ పంత్ ను మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో పోల్చాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఎందుకంటే విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవటంలో టాప్ లో ఉన్నాడు కాబట్టి ఇక రిషబ్ పంత్ ని కూడా అతనితో పోల్చడం బెటర్ అంటూ ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే సిరీస్ విషయానికి వస్తే తొలి రెండు మ్యాచ్ లలో సౌత్ ఆఫ్రికా తర్వాత రెండో మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించడంతో 2-2 తో సిరీస్ సమం గా ఉంది. ఈ క్రమంలోనే ఐదో మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉండగా.. చివరికి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు విజేతలుగా నిలిచాయి.