ఐర్లాండ్ పర్యటనకు.. టీమిండియాతో చీఫ్ సెలెక్టర్.. కారణం?

praveen
మరికొన్ని రోజుల్లో టీమిండియా జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్ల పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఐర్లాండ్  పర్యటనకు వెళ్లి పోయే టీ-20 జట్టును ఇప్పటికే బిసిసిఐ ప్రకటన చేసింది. ఈ జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది అన్న విషయం తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని భారత జట్టు ఎలా బరిలోకి దిగపోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20ల సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇక జూన్ 26వ తేదీ నుంచి ఐర్లాండ్ టీమిండియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.
 ఇదిలా ఉంటే ఇక టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన వార్త బయటకు వచ్చి వైరల్ గా మారిపోయింది. ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఐర్లాండ్ సిరీస్కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్  రాహుల్ ద్రవిడ్ కూడా దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా కొనసాగుతున్న వి.వి.ఎస్.లక్ష్మణ్ యువ టీమిండియాకు కోచ్గా గా నియమితుడయ్యాడు.

 ఈ క్రమంలోనే అటు టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సైతం భారత జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళిపోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కు భారత జట్టుతో కలిసి ఉన్నాడు సెలెక్టర్ సునీల్ జోషి. ఇంగ్లాండ్ పర్యటనకు కూడా మరో సెలెక్టర్ జట్టుతో కలిసి వెళ్లే అవకాశముంది. ఇలా సెలెక్టర్లు జట్టుతో ఉండడానికి కారణం వచ్చే ప్రపంచకప్ కోసం అత్యుత్తమ జట్టును ఎంపిక చేయడమే అన్నది తెలుస్తుంది. ఇక ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే టీమ్ ఇండియా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి..
 భారత టీ20 జట్టు: హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌, చహల్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, హర్షల్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: