వరల్డ్ కప్ ముందు ప్రయోగాలు అవసరమా.. గంగూలీ షాకింగ్ సమాధానం?

praveen
గత ఏడాది తప్పకుండా ప్రపంచ కప్ గెలిచి తీరుతుంది అనుకున్న భారత జట్టు గ్రూపు దశలోనే నిష్క్రమించింది. కానీ ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసిమీద ఉంది టీమిండియా. దీంతో వరల్డ్ కప్ జట్టు కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు రాహుల్ ద్రవిడ్. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరికొన్ని రోజులు వరల్డ్ కప్ ఉంది. ఇలాంటి సమయంలో ఇన్ని ప్రయోగాలు అవసరమా అని ప్రశ్నించగా..  తాము ఇంకా ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేయలేదని సమాధానం ఇచ్చాడు సౌరవ్ గంగూలీ.

 వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి టీ20 ప్రపంచకప్ జట్టు కోసం బీసీసీఐ కృషి చేస్తోంది అంటూ తెలిపాడు. ఇంగ్లాండ్ లో ఆడే జట్టు లోనే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఉంటారని కోచ్ రాహుల్ ద్రవిడ్ అంచనావేస్తున్నారు అంటు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.  వరల్డ్ కప్ కోసం సెటిల్డ్ జట్టును ఎంపిక చేయాలని రాహుల్ ద్రావిడ్ ఆలోచిస్తున్నారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనలో మనం వరల్డ్ కప్ జట్టు ని చూసే అవకాశం ఉంది. ఆ సిరీస్లో ఆడే వాళ్ళని ప్రపంచ కప్ లో చూసే అవకాశం ఉందంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. కాగా భారతీయ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్,  దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్ మంచి ఫామ్ లో కనబడుతు మంచి ప్రదర్శన చేస్తున్నారు.

 అదే సమయంలో స్టార్ ప్లేయర్ గా ఉన్నారు పంత్, శ్రేయస్ అయ్యర్ మాత్రం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే ఐర్లాండ్ సిరీస్ జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఇక  కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కు అవకాశం కల్పించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లు కూడా జట్టు లో చేరే అవకాశం ఉంది. దీంతో రిషబ్ పంత్,  శ్రేయాస్ అయ్యర్ లపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: