ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు : దినేష్ కార్తీక్

praveen
మొన్నటివరకు ఐపీఎల్లో ఇక ఇప్పుడు ఇండియా సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరుగుతున్న టి20 సిరీస్ లో మెరుపులు మెరిపిస్తున్న బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది దినేష్ కార్తీక్ అనే చెప్పాలి. అతని కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో అద్భుతంగా పుంజుకున్న దినేష్ కార్తీక్ టీమిండియాలో ఫినిషర్ గా ఎదుగుతూ ఉన్నాడు. ఇక రాబోయే టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు తరఫున ఆడటమే తన లక్ష్యం అంటూ ఇక ఆ దిశగా మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు దినేష్ కార్తీక్. ఇటీవలే నాల్గవ టి20 మ్యాచ్ లో 27 బంతుల్లో 55 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

 ఇకపోతే ఇటీవల బీసీసీఐ.టీవీ కోసం హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక్ ని ఇంటర్వ్యూ చేయగా ఇక ఇంటర్వ్యూ లో భాగంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.  దినేష్ కార్తీక్ పని అయిపోయిందన్నారు. మరి నీలో మార్పు రావడానికి కారణాలు ఏంటి అంటూ హార్థిక్  ప్రశ్నించగా.. చూడు హార్దిక్ పాండ్యా నేను రాబోయే టి20 ప్రపంచకప్ కు ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నా.  నా తదుపరి లక్ష్యం అదొక్కటే. అది నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ప్రపంచ కప్ ప్రాబబుల్స్ లో మన పేరు లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను చాలా సార్లు అనుభవించాను.

  టీమిండియా కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనుకున్నాను. అదృష్టవశాత్తు ఐపీఎల్ లో ఆర్సిబి నాకు అవకాశం ఇచ్చింది. ఐపీఎల్లో నా బ్యాటింగ్ ని ఎంతగానో ఆస్వాదించాను.  టీమిండియా లోకి రావడానికి ఎంతో సాధన చేసాను. భారత జట్టుకు కఠిన సమయాల్లో విజయాన్ని అందించే ఆటగాడిగా నేను ఎదగాలి అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం కొత్త కుర్రాళ్ళు యువతతో జట్టులో కొత్త వైబ్స్ ఉన్న నేపథ్యంలో నాలాంటి వాడు జట్టులోకి రావడం అది ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంతో సవాల్తో కూడుకున్నదని నాకు తెలుసు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: