బౌలర్ల ట్రాప్ లో రిషబ్ పంత్.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

praveen
కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టు దూరమవడంతో వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. ఇక ఎన్నో విమర్శలు వచ్చిన తర్వాత రెండు మ్యాచ్ లలో  గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది . ఈ క్రమంలోనే ఏదో టి20 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరం గా మారిపోయింది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఘనవిజయం సాధిస్తుందని అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

 ఇలాంటి సమయంలో కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరు మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది అని చెప్పాలి. ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్సీ లో నాలుగు మ్యాచ్ లలో ఒక్క సారి కూడా రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది లేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ కాదు కదా కనీస పరుగులు చేసింది కూడా లేదు. నాలుగు మ్యాచ్ లలో మూడు సార్లు కూడా ఆఫ్ స్టంప్ వెలుపల బంతులకు వికెట్ సమర్పించుకున్నాడు రిషబ్ పంత్. ఈ ఏడాది రిషబ్ పంత్ 16సార్లు అవుట్ అవ్వగా.. అందులో పది సార్లు వైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు వికెట్ సమర్పించడం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందించాడు.

  రిషబ్ పంత్ ని అవుట్ చేసేందుకు అటు బౌలర్లకు ఆఫ్ స్టంప్ బంతులు వేయడం ఒక పెద్ద అస్త్రంగా  మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. పంత్ వరసగా అన్ని మ్యాచ్ లలో ఒకే విధంగా వికెట్ కోల్పోతున్నాడు. దీంతో బౌలర్లు అందరూ కూడా అతనికి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెనుక బంతులు వేస్తున్నారు. దీంతో ప్రతి మ్యాచ్ లోనూ రిషబ్ పంత్ బౌలర్ల  ట్రాప్ లో పడిపోతున్నాడు. మరీ రానున్న మ్యాచ్ లలో అయినా అతను తన బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకుంటే బాగుంటుంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు  ఇక టి20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ఫలితం తేల్చే మ్యాచ్ కాగా.. నేడు బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: