కేఎల్ రాహుల్ కంటే.. కెప్టెన్ గా అతను చాలా బెస్ట్?

praveen
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు.. గత కొంత కాలం నుంచి దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే సరిగ్గా కొన్నాళ్ళ క్రితం వరకూ అటు  విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్లు తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ శ్రేయస్ అయ్యర్ కి ఉంది అని అందరూ అనుకున్నారు. అయితే అతను గాయపడి ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ కి దూరం కావడంతో సమీకరణాలు మారిపోయాయి. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్సీపై పోటీ విపరీతంగా పెరిగి పోయింది అని చెబుతోంది.


 ఈ క్రమంలోనే 3 ఫార్మాట్లలో కూడా ఎంతో నిలకడగా రాణిస్తూ మంచి ప్రదర్శన చేస్తున్న కేఎల్ రాహుల్ టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ గా చూస్తూ ఉన్నారు సెలెక్టర్లు. అందుకే అతనికి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఇక ఇటీవల రోహిత్ శర్మ లేకపోవటంతో అతనికి వన్డే కెప్టెన్సీ కూడా అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే.  స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్ లో మొదట కె.ఎల్.రాహుల్ కెప్టెన్గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే.


 కానీ గాయం కారణంగా కె.ఎల్.రాహుల్ దూరం కావడంతో. ప్రస్తుతం పంత్ కెప్టెన్సీ చేపట్టాడు. కానీ పంత్ అంచనాలను అందుకోలేక పోతున్నాడు. ఈ సమయంలోనే శ్రేయస్ అయ్యర్ లేదా హార్దిక్ పాండ్యాలకు టీమిండియా కెప్టెన్సీ అప్పగించాలంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు. ఇక కేఎల్ రాహుల్ కంటే హార్థిక్ పాండ్యా టీ20 కెప్టెన్సీ అప్పగించడం సరైన నిర్ణయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఐపీఎల్లో సత్తా చాటి గుజరాత్ జట్టుకు టైటిల్ అందించాడు. ఇక బాల్ తోనే కాకుండా బ్యాట్ తో కూడా అదరగొట్ట గల సామర్ధ్యం ఉందని చెప్పాలి. డెత్ ఓవర్ లలో  ప్రత్యర్థులను తన వ్యూహాలతో  ఒత్తిడిలో కూడా నెత్తగలడు. కే ఎల్ రాహుల్ కంటే హార్దిక్ పాండ్యా సమర్థవంతమైన కెప్టెన్ అంటూ దిగ్గజ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: