వైరల్ : ఉమ్రాన్ తో పెట్టుకుంటే ఇంతే.. నివ్వెరపోయిన పంత్?
అయితే అటు మొదటి టి20 మ్యాచ్ లో మాత్రం ఉమ్రాన్ మాలిక్ అవకాశం రాలేదు. ఇక రెండవ టీ20 మ్యాచ్ లో అతనికి అవకాశం రావడం పక్కా అని ఎంతోమంది అభిమానులు బలంగా నమ్ముతూ ఉన్నారు. అయితే ఐపీఎల్ లో 14 మ్యాచ్ లలో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ అటు ప్రాక్టీస్ సెషన్లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. మొదటి టీ20 మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్ లో గెలిచేందుకేజ్ ప్రాక్టీస్ సెషన్లో మునిగితేలుతోంది. ఈ క్రమంలోనే తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఇటీవలే నెట్ లో ఎంతో సేపు ప్రాక్టీస్ చేశాడు.
ఈ క్రమంలోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రిషబ్ పంత్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఇక స్పీడ్ గా ఉమ్రాన్ మాలిక్ సంబంధించిన బంతి ఒకటి ఏకంగా రిషబ్ పంత్ బ్యాట్ విరగ్గొగొట్టింది. ఏకంగా 165 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ బంతిని విసరడంతో చివరికి బ్యాట్ విరిగింది. దీంతో బ్యాట్ చూస్తూ అక్కడే నిద్రపోయినట్లు గా నిలబడి పోయాడు రిషబ్ పంత్. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదే 165 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి అటు టి20 మ్యాచ్ లో పడితే మాత్రం ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం అని అందరూ అనుకుంటున్న మాట.