ఉమ్రాన్ మాలిక్ ను సెలెక్ట్ చేయవద్దు : రవి శాస్త్రి

praveen
ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ తన ప్రదర్శనతో ఎంతలా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను విసురుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అంతేకాదు సీనియర్లతో ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు చూపును కూడా ఆకర్షించి ఇటీవలే టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఆడే టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ లో అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు. ఇక రెండవ టీ20 మ్యాచ్ లో మాత్రం జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు  మొదలు పెట్టింది బీసీసీఐ. కాగా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దే పనిలో పడింది.  ఇందులో భాగంగానే యువ ఆటగాళ్లను అటు సౌత్ ఆఫ్రికాతో టి20 సిరీస్కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో  ఉమ్రాన్ మాలిక్ ను ఉద్దేశించి భారత మాజీ కోచ్ రావిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టి20 వరల్డ్ కప్ కోసం ఉమ్రాన్ మాలిక్ ను భారత జట్టులోకి తీసుకోకూడదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు రవిశాస్త్రి.  ఉమ్రాన్ మాలిక్ కు ఇంకా టి20లో అంత అనుభవం లేదు. అతన్ని మరింత తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే టి20 ప్రపంచకప్ కు అతడిని భారత జట్టుకు ఎంపిక చేయవద్దు. అతడిని వైట్ బాల్ క్రికెట్ లో కొన్నాళ్లపాటు ఆడనిస్తే బాగుంటుంది. ఇక టెస్టుల్లో కూడా  అవకాశం ఇవ్వాలి.. ఇక రెడ్ బాల్ క్రికెట్ లో కూడా అతను ఎలా రాణిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: