సౌత్ ఆఫ్రికాతో టి20 సిరీస్.. వాళ్లే కీలకమంటున్న రైనా?
ఇంతకీ ప్రతీకారం ఎందుకు అనుకుంటున్నారు కదా.. సరిగ్గా ఈ ఏడాది జనవరి నెలలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో గాయం కారణంగా రోహిత్ శర్మ టీమిండియా కు దూరంగా ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్ ఆడిన టీమ్ ఇండియా జట్టు కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో టీ20 వన్డే సిరీస్ లు ఆడింది. ఇక ఈ రెండు సిరిస్ లలో కూడా క్లీన్స్వీప్ కావడం గమనార్హం.
దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు భారత్ వేదికగా అదే కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగేందుకు సిద్ధం అయింది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇటీవల ఇదే టి20 సిరీస్ గురించి భారత మాజీ ప్లేయర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో యువ ఆటగాళ్లు ఎంతో కీలకమని చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు.. హర్ష దీప్ బౌలింగ్ చేసే విధానం బాగుంది. కేఎల్ రాహుల్ ఐపీఎల్ తరహాలోనే ఇప్పుడు టీమిండియాను కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడు అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.. కాగా జూన్ 9వ తేదీన ఢిల్లీ వేదికగా ఇక మొదటి 20 మ్యాచ్ జరగబోతోంది.