ఏదో ఒక రోజు ఐపీఎల్ ఆడతా : దక్షిణాఫ్రికా కెప్టెన్

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంత గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ దేశంలో దేశీయా క్రికెట్ లీగ్ లు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఎందుకో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రం విదేశీ లీగ్ లకంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు కూడా ఆడాలని చోటు దక్కించుకోవాలని ఎంతగానో భావిస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే భారత ఆటగాళ్లు కంటే విదేశీ ఆటగాళ్లదే ఐపిఎల్ హవా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది.


 ఈ క్రమంలో తనకు కూడా ఐపిఎల్ ఆడాలని ఉంది అంటూ దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ టెంప బావుమా  మనసులో మాట బయట పెట్టాడు. ఏదో రోజు తప్పకుండా ఐపీఎల్ వెళ్తాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాలం కలిసి వస్తే ఏదో ఒక జట్టుకు కెప్టెన్ వ్యవహరించే అవకాశం కూడా రావాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు టెంప బావుమా. కెప్టెన్గా  మారాలి అంటే ముందుగా ఐపీఎల్ లో ఏదో ఒక జట్టు లో ఆడే చాన్స్ మాత్రం రావాల్సిందే అని తెలిపారు. కాగా ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతమంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భాగమయ్యారు. ఎబి డివిలియర్స్  లాంటి స్టార్లు బేబీ డివిలియర్స్ లాంటి యువ ఆటగాళ్లు కూడా చాలామంది ఉన్నారు.


రబడ, డేవిడ్‌ మిల్లర్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, మార్కో జాన్‌సెన్‌ లాంటి ఆటగాళ్లు ఇప్పటికీ ఐపీఎల్ అదరగొట్టేసారు  ఈ క్రమంలోనే మరి వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో అయినా దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల టెంప బావుమా కోరిక తీరుతుందో లేదో చూడాలి. ఈ ఏడాది మెగా వేలం జరిగిన సమయంలో అతను పేరు నమోదు చేసుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: